- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పిఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాలింగాపురం గ్రామానికి చెందిన కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టకు కృషి చేయాలన్నారు.
మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల ఉభిలోకి ముఖ్యమంత్రి కెసిఆర్ నెట్టారని అన్నారు. ప్రభుత్వ పథకాలను భారసా కార్యకర్తలకే అందచేస్తున్న ఘనత ఈ ముఖ్యమంత్రి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లోల్ల శ్రీకాంత్, మర్రి రాంరెడ్డి, రవీందర్, లక్ష్మారెడ్డి, హర్ష రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీష్ కుమార్, యూసఫ్, కాజా, రాములు. సత్యం, నర్సింలు, రాందాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.