సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ లోకి పెరుగుతున్న చేరికలు

సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ లోకి పెరుగుతున్న చేరికలు

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనకు ఆకర్షితులై ఎందరో బీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మహలింగపురం గ్రామ సర్పంచ్ మాణిక్ రెడ్డి ఆధ్వర్యంలో మహాలింగాపురం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు, బీజేపీకి  చెందిన యువకులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే గులాబీ కండువలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డల వలె ఆదుకుంటున్నారని కొనియాడారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ యాదగిరి, మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం శంకర్ పల్లి పిఎసిఎస్ బద్దం శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, శంకర్ పల్లి మాజీ ఉప సర్పంచ్  ప్రవీణ్ కుమార్ డైరెక్టర్లు పాల్గొన్నారు.