ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

రచ్చబండ, శంకర్ పల్లి: వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకలు శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి, వార్డ్ సభ్యులు కవేలి రాంరెడ్డి, పులకండ్ల అజెండర్ రెడ్డి, చాకలి రాములు, చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజాకారులను, భూస్వాములును ఎదురించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తొలి భూ పోరాటానికి సామాజిక న్యాయానికి నాంది పలికిన ధైర్య శాలి, వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.

ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఐలమ్మ వీరత్వాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక సంఘం అధ్యక్షుడు సిహెచ్. అనంతయ్య, యువ నాయకులు హరీశ్వర్ రెడ్డి, మాణిక్య రెడ్డి, సిహెచ్ మహేందర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.