Chevella MLA Kale Yadaiah.. రాష్ట్రంగా ఏర్పడ్డాకే తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామాల అభివృద్ధికి నడుం బిగించారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొనియాడారు. మంగళవారం శంకర్ పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించిన అండర్ డ్రైనేజ్ మురికి కాలువలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మిర్జాగూడ గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో 9 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు.

మహారాజ్ పేట్ గ్రామంలో 40 లక్షల నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డు కు శంకుస్థాపన చేశారు. అలాగే 10 లక్షల రూపాయలతో గ్రామంలో నిర్మిస్తున్న ముదిరాజ్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. గోపులారం గ్రామంలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన సభలలో మాట్లాడుతూ 65 సంవత్సరాలు కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పాలించి గ్రామాలలో కనీస సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కొనియాడారు. ప్రధాన రహదారి నుండి ప్రతి గ్రామానికి సిసి రోడ్డు, బీటీ రోడ్లు వేయించారని తెలిపారు. ఈనాడు ఏ గ్రామానికి వెళ్లిన ప్రతి గల్లీలో సిసి రోడ్లు దర్శనం ఇస్తాయని చెప్పారు. పల్లె ప్రకృతి వనాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయించి మొక్కలు నాటించడంతో ఆ గ్రామా లలో ప్రస్తుతం పచ్చని చెట్లతో దర్శనమిస్తున్నాయని తెలిపారు.

వీటితోపాటు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగునీరు అందించి నీటి సమస్య లేకుండా చేశారని చెప్పారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ ని మళ్లీ మనం గెలిపించుకోవాలని కోరారు. కాగా జనవాడ గ్రామంలో విద్యుత్ సమస్య చాలా ఉందని ఆ గ్రామ సర్పంచ్ గౌ డి చర్ల లలిత నరసింహ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గ్రామంలో అదనంగా నాలుగైదు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించి కరెంట్ సమస్యను తీర్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి జడ్పిటిసి చేకూర్తా గోవిందమ్మ గోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, ఉపసర్పంచ్ శాంతి కిషన్ సింగ్, మహారాజ్ పేట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, జనవాడ ఎంపీటీసీ టీ. నాగేందర్, ఉపసర్పంచ్ సీతారాములు, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి,

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, రాయదుర్గం పిఎసిఎస్ చైర్మన్ అరవింద్ రెడ్డి, మండల, మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కె.గోపాల్, వి.వాసుదేవ్ కన్నా, మండలం టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మహాలింగాపురం ఎంపీటీసీ యాదగిరి, గాజులగూడ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, జి. గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకటరెడ్డి, సామయ్య, ఆయా గ్రామాల వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.