దేశానికే తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆదర్శం

దేశానికే తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆదర్శం

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: దేశానికి ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిలుస్తున్నాయని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. అలాగే శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపురం చెరువులో కూడా చేప పిల్లలను వదిలారు. రెండు చెరువులలో మొత్తం లక్ష చేప పిల్లలను వదిలారు.

బుల్కాపురం గ్రామంలో ప్రతిష్టించిన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలోని సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కులవృత్తులను సీఎం కేసీఆర్ ఒకటి ఒకటిగా తీర్చిదిద్దుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతున్నాయని తెలిపారు.

తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్ళీ ముఖ్యమంత్రి మూడోసారి అవుతారని చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మండల, మున్సిపాలిటీల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు జూలకంటి లక్ష్మమ్మ రాంరెడ్డి, గోపాల్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, పొద్దుటూరు గ్రామ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.