సాగర్ బరిలో 41 మంది అభ్యర్థులు

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ దాఖలు చేసిన 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ప్రధాన పార్టీలైన అధికార టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్ పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్ నాయక్ పోటీలో నిలిచారు.