బెంగళూరు డ్రగ్స్ కేసులో కదులుతున్న హైదరాబాద్ డొంక
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని ఓ ఫాంహౌస్ లో కన్నడ హీరో ఇచ్చిన వింధుకు హాజరైన వారి కోసం తీగలాగుతున్నారు. ఆ వింధుకు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక తెలుగు నటుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని అక్కడి అధికారులు సేకరించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రియల్టర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. వరుస వివాదాల్లో చిక్కకున్న ఓ ఎమ్మెల్యే ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
బెంగళూరు ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించిన సమాచారం మేరకు సినీ ప్రముఖులు ఇచ్చిన వింధులో వారు పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోనున్నారు. ఏకంగా ఓ తెలంగాణ ఎమ్మెల్యే నేరుగా కొకైన్ ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికే పలువురు కన్నడ సినీ నిర్మాతలు, వ్యాపర వేత్తలకు విచారణకు రావాలని ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. తదుపరి విచారణకు హాజరు కావాలని నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అవకాశముంది. డ్రగ్స్ సరఫరా చేసిన ముగ్గురితో పాటు నైజీరియన్లు ఇచ్చిన సమాచారం మేరకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వారిలో హైదరాబాద్ శివారు పరిధిలోని ఓ ఎమ్మెల్యేతో పాటు ఒక దక్షిణ తెలంగాణ, మరో ఇద్దరు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలకు ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇచ్చే అవకాశముంది. దీంతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి.