భర్త మర్మాంగాన్ని కోసి చంపిన మహిళ

వైవాహిక బంధాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయి. భార్యభర్తల నడుమ అనుమానాలు పెనుభూతాలై కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. అవి కొన్నిచోట్ల హత్యలకే దారి తీస్తున్నాయి.

మహారాష్ట్రలోని కొల్లాపూరులో జరిగిన ఈ దారుణ ఘటన కుటుంబ కలహాలకు పరాకాష్టగా నిలిచింది. ఓ వ్యవసాయ క్షేత్రంలో చందన, ప్రకాశ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. అయితే వారిలో అనుమానం రగిలింది. అదే పెనుభూతమైంది.

తన భార్య వందనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఆమె భర్తలో కలిగింది. అది రోజురోజుకూ తొలిచేసేది. ఈ క్రమంలో నిత్యం తాగొచ్చి భార్యను కొడుతూ వేధించేవాడు. ఇలా కొంతకాలం భరించిన ఆ ఇల్లాలు ఇక భరించలేకపోయింది.

రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి కూడా తాగొచ్చిన భర్త వందనతో గొడవ పడ్డాడు. ఇక తట్టుకోలేని ఆమె భర్తపై తిరగబడింది. అదే అదనుగా క్షణాల్లో కత్తితో అతడి మర్మాంగాన్ని కోసి హతమార్చింది.

ఈ ఘటన అనంతరం ఆ మహిళపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అయితే చిన్నపాటి అనుమానాలే పెనుభూతాలై ఇలా దారుణ ఘటనలకు దారితీస్తున్నాయి.