19న బయటకెళ్తున్నారా? అవి బందుంటాయి!

ఈనెల 19న గురువారం బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారా.. మరీ ప్రైవేటు వాహనాలలో వెళ్లేందుకు ప్లాన్ చేద్దామనుకున్నారా.. దాని కోసం మీరు ఫిక్సయి పోయారా.. మరి ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..

మే 19న తెలంగాణ రవాణా బంద్ పాటించాలని తెలంగాణ ఆటో, క్యాబ్, డీసీఎం, లారీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. వాహనాల ఫిట్నెస్ రెన్యువల్ అయిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున ఫెనాల్టీ వేస్తూ జీవో నెంబర్ 714ను తీసుకురావడాన్ని రద్దు చేయాలని కమిటీ కోరుతోంది.

ప్రభుత్వాలు తమ ఖజానను నింపుకోవడానికి తమపై జరిమానాలు విధించడంపై ఆటో, లారీ, క్యాబ్ కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్రో ధరల భారంతో నలిగి పోతున్నామని, మళ్లీ జరిమానాల బాధుడుతో మరింత నష్టపోతామని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆ రోజున ఆటోలు, క్యాబులు, డీసీఎంలు, లారీల బంద్ ఉంటుంది.. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి.