ఖమ్మం జిల్లాలో దారుణం.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ పొడిచి చంపిన దుండగుడు

Flash news.. Flash news

రచ్చబండ, ముదిగొండ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సోమవారం దారుణం చోటుచేసుకొంది. బైక్ పై వెళ్తున్న ఆ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. మానవతా దృక్పథంతో లిఫ్ట్ ఇచ్చినందుకు ఆ దుండగుడి చేతిలో తన ప్రాణాన్నే బలి తీసుకున్న వైనమిది. తాజా ఘటన వివరాలిలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (50) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి గ్రామంలోని తన కూతురును చూసేందుకు వెళ్తున్నాడు. ముదిగొండ మండలం బాణాపురం వద్ద వల్లభి వెళ్లే రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు.

మానవతా దృక్పథంతో అటువైపే వెళ్తున్నాననే ఉద్దేశంతో జమాల్ సాహెబ్ బైక్ ఆపి అతన్ని ఎక్కించుకున్నాడు. రోడ్డుపై వెళ్తుండగా వెనుక కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి కుక్కలకు వేసే ఇంజక్షన్ ను జమాల్ సాహెబ్ కు పొడిచాడు. దీంతో ఆయన విలవిల్లాడుతూ నేలకూలాడు. ఆ తర్వాత ఎంచక్కా అదే బైక్ తో ఆ దుండగుడు పరారయ్యాడు.

ఈ సందర్భంగా రోడ్డుపై వేరే వాహనాల్లో వెళ్లే వారు ఈ విషయాన్నిగమనించారు. వెంటనే జమాల్ సాహెబ్ ను సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడికి చూపించగా చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలిసిన ముదిగొండ ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.