పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
- సీపీఎస్ ఈయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మర్పల్లి అశోక్
రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయ్ యూనియన్, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించడానికి ఈ నెల 12న తల పెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, టీఎస్ సిపిఎస్ ఈయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మర్పల్లి అశోక్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో జరుగుతున్న ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమంలో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు లక్షల పదివేల సిపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కుటుంబాల ఆవేదననూ, ఉద్యోగికి భద్రత లేకపోవడంతో కుటుంబం అభద్రత భావానికి గురి కావడంతో చేసే పనిలో ఏకాగ్రత నశించి అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈరోజు ఉపాధ్యాయులు పొందుతున్న జీతంతో సంతృప్తి చెంది, భవిష్యత్తులో ఎదురుకోబోయే భారి ముప్పును పసిగట్టలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసి, సిపిఎస్ విధానంలో ఉండి పదవీరమున పొందిన మరియు అకాల మరణం చెందిన ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ లేకపోవడం వల్ల ఎంత నష్టమో,ఎన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించి, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సమస్య మనదిగా భావించారు.
ప్రతి ఒక్కరు ఆగస్టు 12వ తేదీన హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రభుత్వానికి తమ గోడు వినిపించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల ముందు ఉద్యోగులకు సంతృప్తి కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకొని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాదక్షులు కవ్వగుడెం శ్రీను, ఎఫ్ ఎల్ఎన్ నోడల్ ఆఫీసర్ నరహరి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేశ్వర్, ఆర్పీలు బాలరాజు, జగదీశ్వర్, ఉపాధ్యాయులు యాదయ్య, కృష గౌడ్, నాగేష్, కృష్ణ, శివకుమార్, నర్సింలు, రియాజ్, సుకన్య, మనీలా, మాధవి, పద్మజ, రాజేశ్వరి, పద్మ, లలిత, శ్వేత, బాలమని, గిరీజ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.