చేవెళ్ల ప్రజల కోసం ఆరోగ్యరథం

చేవెళ్ల ప్రజల కోసం ఆరోగ్యరథం

  • సొంత నిధులతో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఏర్పాటు
  • శంకర్ పల్లి మండలం పరివేదలో ప్రారంభం
  • ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని పిలుపు

రచ్చబండ, శంకర్ పల్లి: ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని, రాబోయే రోగాలపై అవగాహన కలిగి ఉండాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పరివేద గ్రామంలో చేవెళ్ల ఆరోగ్య రథంను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో తన సొంత డబ్బుతో ఆరోగ్యరథం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఆరోగ్య రథం బస్సును గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.

 

తమ బస్సు రతంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. కంటి సమస్యలు ఉన్న ప్రజలు తమను సంప్రదిస్తే ఉచితంగా వారికి కంటి పరీక్షలు చేయిస్తామని, అన్ని ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి ,శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రమౌళి, గండేటి శ్రీనాథ్ గౌడ్, పరవేద సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, నాయకులు ప్రవీణ్ కుమార్, సురేందర్ గౌడ్, సంజీవరెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.