కమ్మెట కత్వ మరమ్మతులకు రూ.50 లక్షలు

కమ్మెట కత్వ మరమ్మతులకు రూ.50 లక్షలు

  • చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
  • కత్వ కాలువ పరిశీలన

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలోని కమ్మెట కత్వ కాలువను చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి శనివారం సందర్శించారు. కాగా చేవెళ్ల మండలం కమ్మెట, శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామ రైతులతో కాలువ విషయంలో మాట్లాడారు. 20 సంవత్సరాల నుంచి కత్వ సమస్యలు ఉన్నాయని ఇరు గ్రామాల రైతులు ఎంపీకి వివరించారు.

 

కత్వ మరమ్మతులకు తన నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తూ, సంబంధిత ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులకు పనులు మొదలు పెట్టాలని ఫోనులో ఆదేశించారు. కత్వ సమస్యలను పరిష్కరించినందుకు ఆయా గ్రామాల రైతులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, పొద్దుటూరు సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, కమ్మెట, గొల్లగూడ గ్రామాల సర్పంచులు రాజు, రామచంద్రయ్య, శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.