Shankerpally Mandal.. పల్లెల్లో పల్లెప్రగతి సంబురాల సందడి

  • శంకర్ పల్లి మండలంలోని 26 గ్రామాల్లో వేడుకలు
  • పల్లెప్రకృతి వనాల్లో సహపంక్తి భోజనాలు
  • సర్పంచులు, కార్యదర్శులకు అభినందనలు

రచ్చబండ, శంకర్ పల్లి:  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరూరా సందడి నెలకొన్నది. శంకర్ పల్లి మండలంలోని 26 గ్రామపంచాయతీల్లో సర్పంచులు, అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.

గ్రామపంచాయతీ కార్యాలయాలను రంగురంగుల పూలతో అలంకరించారు. ట్రాక్టర్లకు మామిడాకులతో అలంకరించారు. ఒక పండుగల పల్లె ప్రగతి సంబరాలను ప్రజలు జరుపుకున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో సర్పంచులు, అధికారులు, నాయకులు గ్రామాల ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

జనవాడ సర్పంచ్ లలితా నరసింహకు సన్మానం

జనవాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన పల్లె ప్రగతి సంబరాలు ఆ గ్రామ సర్పంచ్ గౌడిచెర్ల లలిత నరసింహను మండలంలో ఉత్తమ సర్పంచ్ గా ఎంపికైనందుకు ఆమెను శాలువాతో సత్కరించారు. అలాగే ఉపసర్పంచ్ కూడా మండలంలో ఉత్తమ ఉప సర్పంచ్ గా ఎంపికైనందుకు ఆమెను కూడా శాలువతో సన్మానించారు.

గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి జనవాడ ప్రధాని చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి జై తెలంగాణ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు మండల విద్యాధికారి అక్బర్, మండల మాజీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌడిచర్ల నరసింహ, వార్డు సభ్యులు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీడీవో వెంకయ్య, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మిర్జాగూడ, మహారాజ్ పేట్, దొంతంపల్లి, గోపులారం, మోకిలా గ్రామాల సర్పంచులు రవీందర్ గౌడ్, దోసాడ నరసింహారెడ్డి, అశ్విని సుధాకర్, పొడవు శ్రీనివాస్, సుమిత్ర మోహన్ రెడ్డి వార్డు సభ్యులు, అధికారులు వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.