BJP Leader Thulasiram Vijaykumar.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తోడ్పాటు

  • బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నేత వర్రీ తులసీరామ్ విజయకుమార్
  • మోకిలా, మోకిలా తండాలో ‘గడపగడపకు బీజేపీ- ఇంటింటికీ విజయ్ అన్న’ కార్యక్రమం

రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తున్నదని బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు వర్రీ తులసీ రామ్ విజయకుమార్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా, మోకిలా తండా గ్రామాల్లో శుక్రవారం ‘గడపగడపకు బీజేపీ- ఇంటింటికీ విజయ్ అన్న’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం 42 శాతం నిధులు పెంచిందని తెలిపారు. మిషన్ భగీరథ లో భాగంగా ఇంటింటికి నల్ల పథకానికి జెల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు 2018- 2022 వరకు 2500 కోట్ల రూపాయలు ఇచ్చిందని వివరించారు. గత ఆరేళ్లలో ఆహార సబ్సిడీ కింద తెలంగాణకు రూ.26,766 ఓట్లు విడుదల చేసిందని తెలిపారు.

అలాగే జీఎస్టీ పరిహారం కింద రూ.2379 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు రూ.55,624 కోట్లు విడుదల చేశారని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో వీధి వ్యాపారాలకు పీఎం స్వనిధి పథకం ద్వారా రూ.492 కోట్లు కేటాయించగా రూ.452 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు.

దీనిలో 67% రుణాలు మహిళలకు అందించాలని తెలిపారు. కాలేశ్వరం కార్పొరేషన్ కు ఆరు కేంద్ర సంస్థలు మంజూరు చేసిన రుణం 86,644 కోట్ల రూపాయలని అన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాల్లో సగం ఒక్క తెలంగాణకే కేటాయించారని తెలిపారు. ఏడు సంవత్సరాల్లో తెలంగాణలో గల బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికై 22 పథకాల ద్వారా రూ.1613.64 ఓట్లు విడుదల చేసిందని చెప్పారు.

2021లో కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ జీఎస్టీ పరిహారం చెల్లించారన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక సంఘం నిధులు అన్ని కలిపి 12,243 కోట్లు నుండి వచ్చాయని తెలిపారు. గత ఏడేళ్లలో కేంద్రం నుండి పన్నుల వాటా, సంక్షేమ పథకాల అమలు, జాతీయ రహదారులకు, రైల్వే బడ్జెట్ ఇతర పథకాలు, కొత్త ప్రాజెక్టులకు సుమారు 3.20 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయన్నారు.

ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 1170 కోట్లతో గురుకుల పాఠశాలలు, పాఠశాల తరగతి గదులు, పాఠశాలల భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. నైపర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ భవనానికి కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 5200 కోట్ల కేటాయింపు జరిగిందన్నారు.

కరోనా అనంతరం మార్కెట్ల అభివృద్ధికి 3075 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం నిధులను వినియోగించుకోవడంలో కెసిఆర్ సర్కార్ విఫలమైందని తెలిపారు. కెసిఆర్ వి దొంగ హామీలు ఎక్కువగా ఉంటాయన్నారు.

ఈ రెండు గ్రామాలలో ఉదయం నుండి ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నిధుల కరపత్రాలను ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్. ప్రభాకర్ రెడ్డి, బీజేపీ శంకర్ పల్లి మండల అధ్యక్షుడు బసగళ్ల రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.