Chevella MLA Kale Yadaiah.. తొమ్మిదేండ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొమ్మిది సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య చెప్పారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మనీ గార్డెన్స్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్త రూపును సంతరించుకున్నాయని తెలిపారు. పట్టణ రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును రావడమే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.

పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ, ముళ్ల పొదల తొలగింపు, మునిసిపాలిటీలో నర్సరీలు, పార్కులు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల ఏర్పాటు, విద్యుత్ సమస్యల పరిష్కారం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధిలైట్ల ఏర్పాట్లు, ప్రధాన చౌరస్తాల అభివృద్ధి, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలతో మునిసిపాలిటీల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని తెలిపారు.

నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు అధిక నిధులు కేటాయిస్తూ వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. వీటితోపాటు రైతుల శ్రేయస్సు కొరకు సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారని తెలిపారు. వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు నెలనెలా పెన్షన్లు అందిస్తూ వారి జీవితాల్లో సుఖశాంతులను నింపుతున్నారని చెప్పారు.

మళ్లీ ఇలాంటి ముఖ్యమంత్రి రావడానికి మనమంతా ఓకే త్రాటిపై నిలబడాలన్నారు. పట్టణ ప్రగతి సందర్భంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న పలువురు పారిశుద్ధ కార్మికులకు, ఇతర శాఖల సిబ్బందికి శాలువులతో సత్కరించి వారికి మెమెంటో లను అందించారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్, తహసీల్దార్ నయీముద్దీన్, ఎంపీడీవో వెంకయ్య, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.