సింగాపురంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆగడాలు

  • మాజీ సర్పంచ్ శేరిగూడ లచ్చయ్య కుటుంబం ఆవేదన

రచ్చబండ, శంకర్ పల్లి: దళితులమైన తాము కొనుగోలు చేసిన భూమిలోకి తమను రానీయని ఘటన శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని సింగాపురంలో చోటుచేసుకొన్నదని బాధితులు గోడు ఆరోపించారు. మూడు నెలల క్రితం శంకర్ పల్లి నివాసి అయిన కాశెట్టి పెంటయ్యకు సంబంధించిన 12 గుంటల భూమిని (సర్వేనెంబర్ 385) తమ కుటుంబం కొనుగోలు చేసి మూడు నెలల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకొన్నామని సింగాపురం గ్రామ మాజీ సర్పంచ్ శేరిగూడ లచ్చయ్య తెలిపారు.

తాము కొనుగోలు చేసిన ఆ భూమిలో కబ్జాకు రాకుండా అదే గ్రామానికి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల బుచ్చయ్య, శాంతికుమార్ ఆ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ అండదండలతో తమను భూమిలోకి రాకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని లచ్చయ్య ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

బుచ్చయ్య వద్ద ఈ భూమికి సంబంధించిన ఎలాంటి దస్తావేజులు లేవని చెప్పారు. కేవలం సింగాపురం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అండదండలతో తమను భూమిలోకి రానీయడం లేదని ఆరోపించారు. తాను కొనుగోలు చేసిన భూమిలో కడియలు పాతి, సాగుకై ఎరువులు వేస్తున్నారని తెలిపారు.

ఈ విషయమై శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో ఐదు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం రాలేదని చెప్పారు. ఒక మాజీ సర్పంచునైన తనను ఇబ్బందుల పాలు చేస్తుంటే సామాన్యుల గతి ఏంటని లచ్చయ్య ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బడా నాయకులు సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై అధికారులు స్పందించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని మాజీ సర్పంచ్ లచ్చయ్య, ఆయన కుమారుడు ప్రతాప్ అధికారులను కోరారు.