BRS Leader Goudicharla Venkatesh.. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటా

  • బీఆర్ఎస్ శంకర్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి గౌడిచర్ల వెంకటేశ్
  • ఘనంగా వెంకటేశ్ పుట్టినరోజు వేడుకలు
  • జనవాడ గ్రామంలో రక్తదాన శిబిరం

రచ్చబండ, శంకర్ పల్లి: జనవాడ గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా గౌడచర్ల వెంకన్న సేన ఆధ్వర్యంలో ఆదుకుంటామని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి గౌడిచర్ల వెంకటేశ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

వెంకటేశ్ జన్మదినం సందర్భంగా జనవాడ గ్రామంలో గౌడిచర్ల వెంకన్నసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గౌడిచెర్ల వెంకన్న సేన అనుచరులు సుమారు 150 మంది రక్తాన్ని దానం చేశారు.

ఈ సందర్భంగా గౌడిచెర్ల వెంకటేశ్ మాట్లాడుతూ తాను గ్రామంలో స్వచ్ఛందంగా అన్నివర్గాల వారిని ఆదుకుంటానని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో అభాగ్యుల ప్రాణాలు నిలబెట్టవచ్చని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా పలువురు తన సన్నిహితులు సుమారు 150 మంది రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.

గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా గౌడచర్ల వెంకన్న సేన ఆధ్వర్యంలో వారిని ఆదుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనవాడ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నాగరాజు, నాయకులు గౌడిచర్ల రాములు, కుమ్మరి శ్రీను, అంతగాల్ల రాజు, శ్రీకాంత్, చాకలి గణేష్, మోత్కుపల్లి ప్రశాంత్, టి.విజయ్, ఎం. మహేష్, పంతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.