అప్పుడప్పుడు కొందరిని అదృష్టం వరిస్తుంటుంది. ఏదో రూపంలో కలిసొస్తుంది. ఉన్న ఫలంగా కోటీశ్వరులై పోతుంటారు. ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్తుంటారు. అదృష్టం కలిసి రావాలని మనలో కూడా చాలా మంది ఎప్పుడూ కోరుకుంటూ ఉంటూనే ఉంటారు. ఓ కూలీకి అనుకోకుండా అలాంటి అదృష్టమే కలిసొచ్చింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఓ కూలీకి అదృష్టం కలిసొచ్చింది. సునీల్ కుమార్ అనే కూలీ, అతని బృందంలోని మరో ఐదుగురికి 6.26 కేరట్ల వజ్రం లభించింది. లీజుకు తీసుకున్న గని తవ్వకాలు జరుపుతుండగా అది దొరకింది.
వేలంలో ఇది రూ.30 లక్షలు పలకొచ్చని అక్కడి అధికారులు తెలిపారు. వేలం వేయగా వచ్చిన సొమ్ములో 12 శాతం పన్ను రూపంలో మినహాయించుకొని మిగతా నగదును వారికి ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. చూశారా.. అదృష్టం అనేది ఏ రూపంలోనైనా రావచ్చన్న మాట.