ఢిల్లీ పరేడ్ లో మోత మోగిన సూర్యాపేట డప్పుల మోత
* మహిళా డప్పు కళాకారుల బృందం విశేష ప్రతిభ
* అమరారపు సతీశ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన
రచ్చబండ, హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన డప్పు కళాకారులు మోత మోగించారు. జిల్లాలోని గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన ప్రముఖ డప్పు కళాకారుడు, మాస్టర్ అమరారపు సతీశ్ ఆధ్వర్యంలోని మహిళా డప్పు కళాకారుల కళా బృందం పాల్గొని విశేష ప్రతిభను చాటింది. వీరంతా హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మహిళలు.
వీరంతా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి ఎందరితోలో మెప్పు పొందారు. ఢిల్లీ ప్రదర్శన అనంతరం కళాకారుల కళా బృందాన్ని పలువురు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తరపున తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డాక్టర్ మామిడి హరికృష్ణ సహకారంతో, సంగీత నాటక అకాడమీ అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ సౌజన్యంతో ఢిల్లీ పరేడ్ లో డప్పు ప్రదర్శన చేయడం సంతోషకరమని అమరారపు సతీశ్ ఈ సందర్బంగా తెలిపారు.
నారీశక్తిలో మహిళలే డప్పులు కొట్టడం పల్లెటూరు నుంచి దేశ రాజధాని ఢిల్లీలో డప్పు కొట్టడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీ పరేడ్ లో పాల్గొన్న డప్పు కళాకారులు అప్పన్నపేట గ్రామానికి చెందిన కల్పన, నాగమణి, సంధ్య, అనురాధ, భువనేశ్వరి, రోష్ణవి, పరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మార్త, అనిత, కల్మల చెరువు గ్రామానికి చెందిన లావణ్య ధనమ్మ, పొనుగోడు గ్రామానికి చెందిన రజిత, నవ్య, నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన సంధ్య ఈ బృందంలో పాల్గొన్నారని తెలిపారు.