రంగారెడ్డి కలెక్టరేట్ గణతంత్ర వేడుకల్లో 80 మంది శంకర్ పల్లి విద్యార్థుల ప్రతిభ

రంగారెడ్డి కలెక్టరేట్ గణతంత్ర వేడుకల్లో 80 మంది శంకర్ పల్లి విద్యార్థుల ప్రతిభ

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శంకర్ పల్లిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొని వివిధ ప్రదర్శనలు చేపట్టి ప్రతిభ చాటారు.

గైడ్ టీచర్ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల బృందం చేపట్టిన నృత్య ప్రదర్శనకు ప్రత్యేక బహుమతి, మెమెంటో లభించింది. విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించినందుకు మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జి.మహేశ్వరరావు అభినందనలు తెలిపారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకొని పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు బహుమతి గెలుచుకున్న విద్యార్థినులు బాలప్రభ, శ్వేతను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, శివప్రతిక్, సంతోష్ వేముల, సౌజన్య, స్వాతి శ్రీ, స్వాతి ప్రియ, ఫాతిమా, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.