సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నేతకు మాతృ వియోగం

సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నేతకు మాతృ వియోగం

రచ్చబండ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామానికి చెందిన సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ మాతృమూర్తి వీరభద్రమ్మ అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. బొప్పారంలో వీర వీరభద్రమ్మ పార్ధీవ దేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆమె మృతికి సంతాపం తెలిపి, గోపగాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వీరభద్రమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకట్ నారాయణ గౌడ్, అయన సోదరుడైన పిఆర్టియూటి ఎస్ ఆత్మకూర్ ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గోపగాని సుధాకర్ గౌడ్ తో పాటు మరో నలుగురు సోదరులకు సానుభూతిని వ్యక్తం చేశారు.

జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు వీరభద్రమ్మ పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.