శంకర్ పల్లిలో గణేశ్ విగ్రహాల వద్ద ఎమ్మెల్యే యాదయ్య ప్రత్యేక పూజలు
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహాల వద్ద చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు చేశారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో మాజీ సర్పంచ్ సాతా ఆత్మ లింగం ఇంటి ఎదురుగా ప్రతిష్టించిన వినాయక విగ్రహానికి గురువారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు మండలంలోని మిర్జాగూడ గ్రామంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో మునిసిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం. పాపారావు, మాజీ సర్పంచ్ సాతా ఆత్మలింగం మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, మాజీ ఉపసర్పంచ్ లు సాత ప్రవీణ్ కుమార్, దండు సంతోష్ కుమార్, 14వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, అరుణోదయ యువజన సంఘం అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి, ఎస్. రాఘవేందర్, కాసెట్టి మోహన్, గణేష్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.