తప్పుడు వార్తలు రాసేవారిపై చర్యలు తీసుకోవాలి

తప్పుడు వార్తలు రాసేవారిపై చర్యలు తీసుకోవాలి

* శంకర్ పల్లి లలిత ఆసుపత్రి యాజమాన్యం
రచ్చబండ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న లలిత ఆసుపత్రిపై తప్పుడు వార్తలు రాసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులు కోరారు. బుధవారం వారు ఆసుపత్రిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ తాము ఎంతో శ్రమతో రోగులకు వైద్యం అందిస్తుంటే కొన్ని ఆన్లైన్ పత్రికల వారు తమ ఆసుపత్రిపై లేనిపోని వార్తలు రాసి అపవాదు సృష్టిస్తున్నారని తెలిపారు.

ఈనెల 16న హైదరాబాద్ కు చెందిన తండ్రి, కొడుకు శంకర్ పల్లిలో జరిగిన శుభకార్యానికి వచ్చి తిరుగు ప్రయాణంలో బైకు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన వేళ స్థానికులు లలిత ఆసుపత్రికి ఒకరిని తరలించగా తానే స్వయంగా అతని కాలి మడమకు తీవ్ర గాయం కాగా చికిత్స చేశానని చెప్పారు. అనంతరం వైద్యులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆసుపత్రిలో బిల్లు చెల్లించి అతడిని తీసుకెళ్లారని తెలిపారు.

కాగా తమ ఆసుపత్రిపై అక్కసుతో ఒకరు తప్పుడు వార్తను ప్రచురించారని చెప్పారు. బాధితుడికి వేరే డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి ఆపరేషన్ చేశారని తప్పుడు వార్తలు రాశారని తెలిపారు. అయితే ఆ సమయంలో డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి మూడు రోజుల నుండి ఆసుపత్రికి రాలేదని చెప్పారు. డాక్టర్ జరిగిదీశ్వర్ రెడ్డి బాధితుడికి చికిత్స చేశారని రాయడం హాస్యాస్పదంగా ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం తగదని హితవు పలికారు. మరోసారి తప్పుడు వార్తలు రాస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ కుమార్ పాల్గొన్నారు.