క్రీడలతో బాలబాలికల్లో పెరుగనున్న స్నేహభావం

క్రీడలతో బాలబాలికల్లో పెరుగనున్న స్నేహభావం

* శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

రచ్చబండ, శంకర్ పల్లి: క్రీడల వల్ల బాలబాలికల్లో స్నేహభావం పెరుగుతుందని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం స్థానిక అరుణోదయ యూత్ క్లబ్ అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాల బాలికలకు కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలలో కూడా విద్యార్థిని విద్యార్థులు ముందంజలో ఉండాలని తెలిపారు. కాగా ఈ కబడ్డీ క్రీడల లో శంకర్ పల్లి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, చేవెళ్ల, షాబాద్ మండలాల నుంచి కూడా విద్యార్థులు పాల్గొన్నారు కబడ్డీ క్రీడలకు వచ్చిన విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, మాజీ సర్పంచ్ వై. ప్రకాష్, అరుణోదయ యూత్ క్లబ్ మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, యూత్ క్లబ్ ప్రధాన కార్యదర్శి లాలీ తదితరులు పాల్గొన్నారు.