నలుగురు సీఎంలలో స్టాలిన్ నెం.1

మొదటి నుంచి వినూత్న పథకాలతో ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ కు రానురాను ఆదరణ పెరుగుతోంది. 2021 సంవత్సరంలో ఎన్నికైన నలుగురు సీఎంలలో స్టాలిన్ నెంబర వన్ గా నిలిచారు.

గతేడాది ఎన్నికైన అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఐఏఎన్ఎస్ సీఓటర్ సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో తమిళనాడు సీఎంకే అత్యధిక మంది ప్రజలు మద్దతు తెలిపారు.

నలుగురు సీఎంలలో స్టాలిన్ కు 85శాతం మంది ప్రజలు మద్దతుగా నిలిచారు. మిగతా ముగ్గురు కంటే స్టాలిన్ బెస్ట్ సీఎంగా మెచ్చుకున్నారు. దీంతో ఆయన ఆదరణ మరింత పెరిగినట్లు రుజువైంది.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ప్రధాని ఎవరైతే బాగుంటుందన్న అంశంపైనా సర్వే నిర్వహించారు. తమిళనాడులో నిర్వహించిన సర్వేలో రాహుల్ గాంధీకి 54 శాతం, మోదీకి 21 శాతం మంది అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది.