మే 25న భారత్ బంద్

ఈనెల 25న దేశవ్యాప్త బంద్ కు కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం చేపట్టకపోడంపై నిరసనతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధన కోసం ఆయా సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.

కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం చేపట్టకపోవడంతో పాటు ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు, రైతులకుకనీస మద్దతు ధర, పాత పెన్షన్ విధానం అమలు, ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ ఉపసంహరణ వంటి డిమాండ్ల సాధన కోసం ఆయా సంఘాలు బంద్ చేపట్టాలని పిలుపునిచ్చాయి.

ఆలిండియా బ్యాక్ వర్డ్, మైనార్టీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టాలని నిర్ణయించారు.