బాక్సింగ్ చాంపియన్ జరీన్ కు రేవంత్ రెడ్డి నజరానా

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణపతకం సాధించిన నిఖత్ జరీన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడా ప్రతిభకు మెచ్చిన రేవంత్ రెడ్డి జరీన్ కు రూ.5 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. గతంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు ఇచ్చినట్లు నిఖత్ జరీన్ కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పారితోషికం ఇచ్చి ఆదరించాలని రేవంత్ రెడ్డి కోరారు.