chevella MLA Kale Yadaiah.. ప్రజా సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమం

* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

* శంకర్ పల్లి మండలం మాసానిగూడ, కచ్చిరెడ్డి, మంచర్లగూడ గ్రామాల్లో శుభోదయం కార్యక్రమం

రచ్చబండ, శంకర్ పల్లి: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శుభోదయం కార్యక్రమం చేపట్టామని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్ పల్లి మండలంలోని మాసాని గూడ, కచ్చిరెడ్డి, మంచర్లగూడ గ్రామాలలో ఉదయం శుభోదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వ పాలనలో పల్లెల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రతి గ్రామ గ్రామపంచాయతీలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించడం జరిగిందన్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను కేటాయించడం జరిగిందని తెలిపారు.

70 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి పనులు 9 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం చేసిందని చెప్పారు. రైతులకు సీఎం కేసీఆర్ అన్ని సంక్షేమలకు పథకాలు ప్రవేశపెట్టి వారికి 24 గంటల విద్యుత్తును నిరంతరం సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్.పి.జి.టి.సి చేకూర్త గోవిందమ్మ, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్, మండల యూత్ పార్టీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ రాములు, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ సత్తయ్య, నాయకులు గోవర్ధన్ రెడ్డి, చేకూర్త గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.