– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభు లింగం
రచ్చబండ, శంకర్ పల్లి: జూన్ 4వ తేదీన జరిగే చలో కొత్తగూడెం సీపీఐ ప్రజా గర్జన సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. ప్రభులింగం పిలుపునిచ్చారు. గురువారం సీపీఐ మండల కార్యదర్శి పి.సుధీర్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాని చంద్రయ్య, సీపీఐ నాయకులు గంగయ్య, నరసింహులు ఆధ్వర్యంలో వాల్పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4న జరిగే కొత్తగూడెం బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజు, నారాయణ, చాడ వెంకటరెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి .కె. సాంబశివరావు పాల్గొంటారని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు.
ఏప్రిల్ 14 నుంచి 15 వరకు జాతీయ కమిటీ పిలుపుమేరకు మెడికో హటావో దేశ్కో బచావో కార్యక్రమాన్ని గ్రామాలలో ప్రచారం చేసామన్నారు.