శాంతి భద్రతల రక్షణకు సర్పంచులు సహకరించాలి
* సైబరాబాద్ అడిషనల్ ఏసిపి రమణ గౌడ్
రచ్చబండ, శంకర్ పల్లి; గ్రామాలలో శాంతి భద్రతలు కాపాడడానికి సర్పంచులు పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ నార్సింగ్ అడిషనల్ ఎసిపి రమణ గౌడ్ అన్నారు. మంగళవారం శంకర్ పల్లి మండలంలోని నూతనంగా ఏర్పాటైన మోకిలా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయా గ్రామాల సర్పంచులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరై పాల్గొని మాట్లాడుతూ చట్టానికి లోబడి అందరూ మెలగాలని సూచించారు. గ్రామాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాల వల్ల నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చని చెప్పారు. సర్పంచులు, ఆయా గ్రామాల ప్రజలతో మోకిలా సిఐ నరేష్, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
తప్పులు చేసిన వారికి చట్టరీత్యా శిక్షలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఆయా గ్రామాల ప్రజలు పోలీసులకు సహకరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీర్జాగూడ, జనవాడ, గోపులారం, మహారాజ్ పేట్, దొంతంపల్లి, టంగుటూరు, పిల్లిగుండ్ల, మోకిలా సర్పంచులు రవీందర్ గౌడ్, గౌడ చర్ల లలిత నరసింహ, పొడవు శ్రీనివాస్, దూసాడ నరసింహారెడ్డి, అశ్విని సుధాకర్, మోహన్ రెడ్డి, మహారాజ్ పేట్ మాజీ ఉపసర్పంచ్ కొండ రవి, ఎస్ఐలు కృష్ణ, పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.