నేడు జనవాడ పొద్దుటూరులలో ఊరూరా చెరువు పండుగ సంబరాలు…………

నేడు జనవాడ పొద్దుటూరులలో ఊరూరా చెరువు పండుగ సంబరాలు…………

ఎంపీడీవో వెంకయ్య.

నిఘా. శంకర్ పల్లి; తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం శంకర్ పల్లి మండలంలోని జనవాడ, పొద్దుటూరు గ్రామాలలో ఊరూరా చెరువు పండుగ సంబరాలు జరుగుతాయని స్థానిక ఎంపీడీవో వెంకయ్య తెలిపారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండు గ్రామాలలో ఊరూరా చెరువు పండుగ సంబరాలను జరుపుతున్నామని తెలిపారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.