పరిసరాల పరిశుభ్రత కోసం ప్రజలు పాటుపడాలి

పరిసరాల పరిశుభ్రత కోసం ప్రజలు పాటుపడాలి
* శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్.

రచ్చబండ, శంకర్ పల్లి; పరిసరాల పరిశుభ్రత కోసం ప్రజలు పాటుపడాలని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 13వ వార్డులో అండర్ డ్రైనేజ్ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

ఎక్కడ కూడా నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. గుంతలలో నీరు ఉంటే దోమలు, ఈగలు పెరుగు తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భాను వెంకటరామిరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు మహమూద్, నాయకులు పాల్గొన్నారు.