పేదింటి వధువుకు సాయం చేసే ట్రస్టు

• పుస్తె, మట్టెలు, వస్త్రాల వితరణ

సూర్యాపేట : పేదింటి హిందూ వధువులు ఎవరైనా వారి పెళ్లికి సదాచార్ ట్రస్టు సాయం చేయనుంది. వారికి పుస్తె, మట్టెలతో పాటు నూతన వస్త్రాలు అందించి ఆసరాగా నిలవనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎంతో మంది నిరుపేద హిందూ వధువలకు ఈ మేరకు ట్రస్టు ఆధ్వర్యంలో సాయం అందజేశారు.

భావితరాలకు సనాతన ధర్మాన్ని తెలపడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే సదాచార్ ట్రస్టు లక్ష్యమని ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తా తెలిపారు.

ఈ మేరకు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఉన్న సదాచార్ ట్రస్టు సేవా మందిరంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి దాతల సహకారంతో పేదింటి వధువుకు పుస్తె, మట్టెలు అందజేసి వితరణ చాటుకున్నారు.

శ్రీ వామనాశ్రమ మహస్వామిజీ ఆశీర్వచనంతో సదాచార్ ట్రస్టు వ్యవస్థాపక చైర్మన్ సాయి ఈశ్వర్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో తెలంగాణలో దాతల సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన పెండ్లి కుమార్తెలకు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది వధువులకు సాయం అందజేసినట్లు తెలిపారు.

ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 37 మంది వధువులకు మంగళసూత్రాలు, మట్టెలతో పాటు నూతన వస్త్రాలు అందించినట్లు తెలిపారు.

పెండ్లి రోజున పుస్తె, మట్టెలు, నూతన వస్త్రాలు అందించడం సంతోషంగా ఉన్నదని నూతన వధువు తల్లిదండ్రులు ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆర్థికంగా వెనుకబడిన హిందూ మతంలోని కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకునే వధువు పెండ్లి పత్రిక, ఆధార్ కార్డ్, తెల్లరేషన్ కార్డుతో తమ కార్యాలయంలో ముందుగా సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సభ్యులు ఈగా విజయలక్ష్మి, తెడ్ల పల్లవి, రామ కృష్ణ, బచ్చు పురుషోత్తం, కంచర్ల లీల తదితరులు పాల్గొన్నారు.