పట్టిస్తే రూ.10 లక్షలు

ట్రై చేయండి చూద్దాం..!

హైదరాబాద్ :  అతన్ని పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ఇస్తాం.. అతని సమాచారమిచ్చినా, ఆచూకీ తెలిపినా నగదు బహుమానం ఇస్తాం.. అని హైదరాబాద్ నగర పోలీసులు ప్రకటించారు. ఆ నజరానా మీకే దక్కొచ్చు ట్రై చేయండి.. నగదు కోసం కాకపోయినా ఓ దుండగుడిని పట్టించడం కోసమైనా మీరు ట్రై చేస్తారా.. ఇక వివరాలు తెలుసుకోండి.. నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఓ ఆరేండ్ల చిన్నారిని లైంగికదాడి చేసి, అమానుషంగా హత్య చేసిన దుండగుడు పల్లకొండ రాజు ఆచూకీ కోసం పోలీసులు ఈ నజరానా ప్రకటించారు. ఘటన జరిగి ఆరు రోజులైనా ఆ దుండగుడి ఆచూకీ దొరకలేదు. ప్రజలు, ప్రతిపక్షాలు, గిరిజన సంఘాల నుంచి తీవ్ర వత్తడి రావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

30 ఏళ్ల వసయసున్న నిందితుడు, 5.9 అడుగుల ఎత్తు, రబ్బర్ బాండ్ కట్టిన పొడవైన జుట్టు, ఒక టోపీ, మొహానికి చుట్టిన ఎర్రని గుడ్డ, రెండు చేతులపై మౌనిక అనే పేరున్న టాటూస్, గదవపైన గడ్డం, ఫార్మల్ ప్యాంట్, చొక్కా వేసుకొని ఉంటాడని పోలీసులు తెలిపారు. మద్యం తాగి బస్టాండ్ లలో, ఫుట్ పాత్ లపైన పడుకునే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వారు ఈస్ట్ జోన్ డీసీపీ ఫోన్ నెంబర్ -9490616366, టాస్క్ ఫోర్స్ నెంబర్ -9490616627కు ఫోన్ చేయాలని పోలీసులు ఆ ప్రకటనలో తెలిపారు.