ఆసియాలో అత్యంత అవినీతి దేశాలేవో తెలుసా?

ఆసియా ఖండంలో అవినీతికర దేశాల వివరాలను ఓ సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత అవినీతికర దేశాల్లో ఇండియా మొదటిస్థానంలో ఉంది. 69 శాతం అవినీతితో మనదేశం అగ్రస్థానంలో నిలిచింది.

తర్వాతి స్థానంలో వియత్నాం ఉంది. అక్కడ 65 శాతం లంచాలు తీసుకునే వారున్నారు. ఆ తర్వాత థాయ్ లాండ్ దేశంలో 41 శాతం, మన పొరుగునున్న పాకిస్తాన్ లో 40 శాతం చొప్పున అవినీతి నమోదైంది. కాగా కేవలం 0.2 శాతంతో జపాన్ దేశం ఈ జాబితాలో చివరిస్థానంలో ఉంది.