మీరు గణేశ్ ఉత్సవ నిర్వాహకులా?

మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి

గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గణేశ్ మండపాల ఉత్సవకమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగం కోరుతోంది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిబంధనలను వివరించారు.

◆, గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు తప్పనిసరిగా ఆన్ లైన్ (http://policeportal.tspolice.gov.in/index.htm) ద్వారా పోలీసు అనుమతి తీసుకోవాలి.

◆  ఉత్సవక కమిటీ కి చెందిన వారి సెల్ నెంబర్ ను పోలీసు స్టేషన్ లో ఇవ్వాలి.

◆  మండపం పరిసర ప్రాంతంలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు గానీ, వ్యక్తులు గానీ కనిపిస్తే డయల్ 100, సమీప పోలీసు అధికారులకు సమాచారం అందజేయాలి.

◆  గణేశ్ మండపాలను పకడ్బందీగా నిర్మించాలి.

◆  విద్యుత్ సరఫరా కోసం నాణ్యమైన వైర్లను వినియోగించాలి.

◆ గణేశ్ మండపాల వద్ద రాత్రి నిర్ణీత సమయం తర్వాత ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించరాదు.

◆ ఆసుపత్రులు, పాటశాలల వద్ద పెద్ద శబ్దాలతో మైకులు పెట్టరాదు.

◆ గణేశ్ మండపాల వద్ద లక్కీ డ్రాలు నిర్వహించరాదు.

◆ మండపాల పరిసర ప్రాంతంలో పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ లాంటి మండే వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి. ముందస్తు జాగ్రత్తగా మండపం పరిసర ప్రాంతంలో నీరు, ఇసుక, ఫైర్ ఫ్రీ సిలిండర్లను అందుబాటు ఉంచుకోవాలి.

◆ మండపానికి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకునే విధంగా నిర్వాహకులు పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.

◆ అవసరాన్ని బట్టి భక్తులు క్యూలైన్లు పాటించే వివిధంగా బారికేడ్లను నిర్మించాలి.

◆ మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతిపత్రం తీసుకోవాలి.

◆  ప్రవేట్ వ్యక్తుల స్థలమైతే ఆ స్థలం యజమాని అనుమతిపత్రం తీసుకోవాలి.

◆  ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలి.

◆   భక్తులు వచ్చీపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.

◆   ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు.

◆  విద్యుత్ శాఖ అనుమతి ఉండాలి.

◆    వివాదాస్పద స్థలాల్లో గణేశ్ మండపాలు ఏర్పాటు చేయొద్దు.

◆  ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయవొద్దు.

◆  మండపాల వద్ద భక్తి సంబంధిత పాటలు మాత్రమే ప్రసారం చేయాలి.

◆  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అనుమతి అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే బాధ్యత వహించాలి.

◆   నిర్ణీత సమయంలోమాత్రమే మైక్ లు పెట్టాలి.

◆  ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు.

◆   డీజేలకు, బాణాసంచా కు అనుమతి లేదు.

◆  కొవిడ్ నిబంధనలు పాటించాలి.