హైదరాబాద్ : తెలంగాణ ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలో దోస్తు దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. మొదటి విడత దరఖాస్తు గడువు ఈనెల 15వ తేదీతో ముగిసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సీట్ల కేటాయింపులను ఈ నెల 31న ప్రకటిస్తామని తెలిపారు. విద్యార్థులు సీట్ల కోసం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ను ఆగస్ట్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇవ్వాలని పేర్కొన్నారు. రెండో విడత దరఖాస్తులకు ఆగస్ట్ 1 నుంచి 9వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు దోస్త్ లో 1,17,601 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు.