రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఆ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనను ఖరారు చేసింది. వరంగల్ నగరంలో వచ్చేనెల 6న జరిగే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసేందుకు ఆయన ప్రచార సభలు ఖరారయ్యాయి.

వరంగంల్ నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనే సభను విజయవంతం చేయాలని కోరుతూ రేవంత్ జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఇతర ముఖ్య నేతలతో ఆయా సభల్లో రేవంత్ పాల్గొంటారు.

ఈనెల 25న కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు. అదే విధంగా 26న ఖమ్మం జిల్లాలో, 27న నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు.