హమ్మ బాబోయ్!

• ఓ అధికారి ఇంట్లో ఇంత ఆస్తిపాస్తులా?
• టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో సీజ్

ఓ టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో భారీ ఎత్తున ఆస్తులు బయటపడ్డాయి. కోట్లాది రూపాయల ఆస్తులు దొరకడంతో అధికారులే అవాక్కయ్యారు. శనివారం నిర్వహించిన ఈ దాడుల్లో ఈ విషయం బయటపడింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి రాములు నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.3.5 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి.

అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో ఆయన స్థిర, చరాస్థులు కలిపి ఇప్పటి వరకూ రూ.3.5 కోట్ల మేరకు ఉన్నట్లు గుర్తించారు.

వారు శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంతో పాటు నగరంలోని దిల్ సుఖ్ నగర్, వాసవీనగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో నాలుగు బృందాలుగా విడిపోయి ఈ సోదాలు జరిపారు.

ఇళ్లు, ఇళ్ల స్థలాలకు చెందిన పత్రాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, మూడున్నర కిలోల వెండి ఆభరణాలు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ మేరకు రాములును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.