చిరుమర్తి ఇంటికి కోమటిరెడ్డి

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం వచ్చారు. ఇటీవల తండ్రిని కోల్పోయిన చిరుమర్తి లింగయ్యను రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు.

ఎమ్మెల్యే తండ్రి చిరుమర్తి నర్సింహ మృతికి ఆయన సంతాపం తెలిపి, చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తితో కాసేపు ముచ్చటించారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కోమటిరెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఎడబాటు వచ్చింది. ఆ తర్వాత వారు కలుసుకోలేదు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో కొంత ఆసక్తి నెలకొంది.