లీటరు పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.3 తగ్గింపు

రచ్చబండ : పెరిగిన పెట్రో ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. లీటరు పెట్రోలుకు రూ.5, డీజిలుపై రూ.3 తగ్గింపు ఉపశమనం కలిగించింది. ఇది ఎక్కడనేగా మీ అనుమానం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం తీసుకున్న మొదటి ప్రజా సంక్షేమ నిర్ణయం. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఇంధన్ వ్యాట్ తగ్గిస్తూ సీఎం షిండే ప్రకటించారు.