ఆ మూడు జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

రచ్చబండ : ఆషాఢమాసం, బోనాల పండుగ సందర్భంగా గత జూలై నెలలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అయితే ఎన్నడూ లేనంత అమ్మకాలు సాగినట్లు తేలింది.

జూలై నెలలో పండుగలను పురస్కరించుకొని భారీగా మద్యం అమ్మకాలు అయ్యాయని అధికారుల లెక్కలే తేల్చాయి. రాష్ట్రంలో గత నెలలో 4.36 వేల కోట్ల మద్యం అమ్ముడవగా, 5.32 వేల కోట్ల బీర్లను మందు బాబులు తాగేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క జూలై నెలలోనే రికార్డు స్థాయిలో 6,970 కోట్ల మద్యం అమ్ముడైంది. అదే విధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రూ.3,289 కోట్లు, హైదరాబాదులో 3,201 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు ప్రకటించారు.