రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి
* సీపీఐ నేతలు ప్రభులింగం, సుభాన్ రెడ్డి, గోపాల్ రెడ్డి
* శంకర్ పల్లి మండలంలో రామస్వామి ఆధ్వర్యంలో కోనసాగుతున్న కళాజాత
రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎం ప్రభులింగం, జిల్లా ఉపాధ్యక్షులు భానురు సుభాన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ, రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు శంకర్ పల్లి మండలంలోని గ్రామాల్లో సీపీఐ కళాజాతను ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ కే రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
గురువారం మండలంలోని గాజులగూడా, ఆలంఖాన్ గూడ, చెన్నారెడ్డిగూడ, రావులపల్లి గ్రామాల్లో సీపీఐ జండాను ఎగురవేసి కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుపరచలేదని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అయిందన్నారు. ప్రధానమంత్రి పేద ప్రజల బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఇచ్చిన వాగ్దానం విఫలమైందన్నారు.
ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మండల సిపిఐ కార్యదర్శి సుధీర్ కుమార్, మండల కార్యదర్శి మల్కారి సత్తిరెడ్డి, మొయినాబాద్ మండల కార్యదర్శి కే శ్రీనివాస్, ఏ ఐ టి సి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు జి అంజయ్య, శంకర్ పల్లి మండలం సిపిఐ నాయకులు ఎండి. షాబుద్దీన్, గోపాల్ రెడ్డి, పరమయ్య, యాదగిరి, ఎండి ముక్తార్, మహిళ సంఘం నాయకురాలు అమృత, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.