Shankerpally Muncipality.. శంకర్ పల్లి మున్సిపాలిటీలో 816.71 లక్షల పనులకు ఆమోదం

  • కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
  • మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీలో 816.71 లక్షల పనులు చేపట్టేందుకు  మున్సిపల్ సాధారణ సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. శంకర్ పల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులు, పురపాలక సంఘ విభాగం, పారిశుధ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం, సిబ్బంది వేతనాలకు సంబంధించి 284-92 లక్షలు, లీగల్ చార్జీలు, ఇంటర్నెట్ టెలిఫోన్ బిల్స్, టెండర్ నోటీస్, పత్రికా ప్రకటనలు మొదలగు వాటికి 14. 12 లక్షలు, మునిసిపల్ వాహనాలు, ఇంధనం నిర్వహణకై 18 లక్షలు, వీధి దీపాలు, మంచినీటి పంపింగ్ చార్జీలకు 75 లక్షలకు ఆమోదించారు.

ఇంకా ఇంజనీరింగ్ విభాగం వార్డుల వారీగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు 424.67 లక్షలు నియామకం చేస్తూ మొత్తం 816.71 లక్షలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.