అయ్యప్ప ఆలయంలో స్నానపు గదులు నిర్మించిన దాతలకు సన్మానం

అయ్యప్ప ఆలయంలో స్నానపు గదులు నిర్మించిన దాతలకు సన్మానం

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయంలో స్నానపు గదులు నిర్మించిన దాతలు గున్నాల కృష్ణారెడ్డి, బద్దం విష్ణువర్ధన్ రెడ్డిని దేవాలయ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా శంకర్ పల్లి పట్టణంలో శ్రీ అయ్యప్ప దేవాలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఎందరో దాతలు దేవాలయానికి ఆర్థిక సాయం చేశారని చెప్పారు. దేవాలయానికి సహకరించిన దాతలకు అయ్యప్పస్వామి దయ ఎల్లప్పుడూ ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు దండు మోహన్, మిరియాల శ్రీనివాస్, అడ్వకేట్ విశ్వేశ్వర్, జూలకంటి పాండురంగారెడ్డి, కె. శ్రీనివాస్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.