శంకర్ పల్లి మండలంలో 100 మంది బీజేపీలో చేరిక

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని మహరాజ్ పేట్, టంగుటూరు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు గురువారం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ బిజెపి నాయకులు, శంకర్ పల్లి మండల బిజెపి అధ్యక్షులు బి. రాములుగౌడ్ సమక్షంలో బిజెపిలో చేరారు.

సుమారు 100 మంది బిజెపి పార్టీలో చేరినట్లు మండల అధ్యక్షులు రాములు గౌడ్ తెలిపారు. మహరాజ్ పేట్ మాజీ ఉపసర్పంచ్ తొండ రవి, టంగుటూరు గ్రామానికి చెందిన చంటి అప్ప, మణివర్ధన్ రెడ్డి, హరీష్ రెడ్డి, సిహెచ్ కుమార్, కే ప్రశాంత్, శివకుమార్ , ఏ అఖిల్, కే బాలు బిజెపి పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎల్ ప్రభాకర్ రెడ్డి, మండల బిజెపి ఉపాధ్యక్షులు బొల్లారం శశికాంత్ రెడ్డి, నాయకులు బద్దం రాఘవేందర్ రెడ్డి, బద్దం బుచ్చిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.