కాంగ్రెస్ పాలనలోనే పేదలకు సంక్షేమ పాలన

* యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్
* కడ్తాల్ నుంచి ఆమనగల్లు వరకు భారీ బైక్ ర్యాలీ
* అమనగల్లులో బహిరంగ సభ

రచ్చబండ, ఆమనగల్లు: కాంగ్రెస్ హయాంలో పేదలకు సంక్షేమ పాలన అందిందని యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకూర్ల రవికాంత్ గౌడ్ అన్నారు. ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర యొక్క సందేశాన్ని గడప-గడపకు చేర్చేందుకు దాని కొనసాగింపుగా హత్ సే హత్ జోడో యాత్ర పాదయాత్రలో భాగంగా రవికాంత్ గౌడ్ అధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కడ్తాల్ మండల్ కేంద్రం నుండి ఆమనగల్లు మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆమనగల్లులోని మానస గార్డెన్ లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రవికాంత్ గౌడ్, నాయకులు మాట్లాడుతూ హత్ సే హత్ జోడో ఆభియాన్ యాత్రకు ప్రజలనుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. తొమ్మిదేళ్ల బిజెపి బారాస అరాచక పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్, కేంద్రంలో నరేంద్రమోడీ నియంత పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు ఈ రెండు ప్రభుత్వాలు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు.

ఈ తొమ్మిదేళ్లలో రుణమాఫి చెయలేదని, పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదని గ్రామ రైతులు మండి పడుతున్నారని అన్నారు. అలాగె డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇంకా చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాలు లీక్ చేసి డబ్బులు కమిషన్లకు అమ్మి, రాత్రింబవళ్లు కష్టపడి కడుపు మాడ్చుకొని చదువుకున్న పేద నిరుద్యోగుల విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. అలాగె కేంద్రం రోజూ రోజూకు సిలిండర్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు కూడా పేంచి పేద ప్రజల నడ్డి విరుస్తూన్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ పేదప్రజల డబ్బులను అదానికి దొచిపెడుతున్నారని అన్నారు. అటు మోడి పాలన ఇటు కెసిఆర్ పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు. ప్రజా సమస్యలే ధ్యేయంగా పోరాటం చేస్తున్న ఎఐసిసి నాయకుడు ప్రశ్నించే గొంతుక రాహుల్ గాంధీ పై అక్రమంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వ మోడీ నియంత పాలనలకు చరమగీతం పాడుతామని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షలు రుణమాఫి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫి చేస్తామని పాలకూర్ల రవికాంత్ గౌడ్, ఇతర నేతలు ప్రకటించారు. అలాగె అర్హులైన ప్రజలందరకి ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షలు రూపాయిలు, ఇందరమ్మ ఇళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగె సిలిండర్ గ్యాస్ ధర కేవలం 500/- రుపాయిలకే అందిస్తామని అన్నారు. ఇవ్వే కాకుండా మరేన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు బిచ్య నాయక్, రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీ, జహంగీర్ బాబా, కల్వకుర్తి యువజన కాంగ్రెస్ అధ్యక్షలు అనిల్ గౌడ్, కల్వకుర్తి నియోజకవర్గ మండలాల అధ్యక్షులు హీరాసింగ్, దళపతి, రాజు, ఎన్ఎస్యుఐ మండలాల అధ్యక్షులు శబ్బుద్దిన్ , ఫరీద్, రమేష్, కృష్ణ నాయక్, అజీమ్, అబ్దుల్, క్యామ రాజేష్, ఇమ్రాన్, భానుకిరణ్, రాజేందర్ గౌడ్, అలీమ్, రఘు, సత్యం, రవి, కిరణ్, కందుకూరు యూత్ ప్రెసిడెంట్ దంతోజు నర్సింహచారీ, రాచులురు యూత్ టౌన్ ప్రెసిడెంట్ మహేష్ యాదవ్, షేర్ర శ్రీకాంత్, నాని, నరేష్, చింటూ, నరేష్, వెంకటేష్, చారీ, భాస్కర్, రమేష్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.