భారత్ జోడో యాత్రకు త్వరలో ప్రియాంకగాంధీ.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో ఆయన సోదరి, ఆ పార్టీ కీలక నేత ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. దీంతో అన్నా చెల్లెళ్లు పాల్గొనే యాత్రతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నిండుకుంది.

ఇప్పటికే రాహుల్ చేపట్టిన ఈ యాత్రకు విశేష స్పందన కానవస్తుంది. ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం కానవస్తుంది. పార్టీ పుంజుకుంటుందనే ఆశ చిగురిస్తుంది. ఈ దశలో రాహుల్ కు తోడుకు ఆయన సోదరి కూడా పాల్గొననుండటంతో కేడర్లో మరింత ఉత్సహం నిండనుంది.

ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి ప్రియాంక పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు ఆమె ఈ యాత్రలో పాల్గొంటారు. నిత్యం 20 నుంచి 23 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది.