అంతర్జాల మాయాజాలానికి దూరంగా ఉండాలి : సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం

రచ్చబండ, సూర్యాపేట : విద్యార్థినులు అంతర్జాల మాయాజాలానికి గురై తమ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దు.. అని సూర్యాపేట డీఎస్పీ పి.నాగభూషణం సూచించారు. సూర్యాపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో స్వచ్ఛ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాలానికి దూరంగా ఉండి, చదువు పైనే దృష్టి సారించాలని అన్నారు. గురుకులంలో చదివిన విద్యార్థినులు భవిష్యత్ లో అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. తమ లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు. అవసరమైన సమయాల్లో షీటీం సేవలను వినియోగించుకోవాలని సూచించారు.